తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

telangana government has made a key decision on Aayushman Bharat
'ఆయుష్మాన్ భారత్'​పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

By

Published : Dec 30, 2020, 9:41 PM IST

Updated : Dec 30, 2020, 10:12 PM IST

21:39 December 30

'ఆయుష్మాన్ భారత్'​పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్​తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ప్రగతి దృశ్యమాధ్యమ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.  

ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్​తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని సీఎస్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి సమీక్ష నిర్వహించిన ప్రధాని... వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై సమీక్షించారు. తెలంగాణలో 98.5 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నారని ప్రశంసించారు.

ఇదీ చదవండి:పిప్రి ఎత్తిపోతల పనులు చేపట్టండి: సీఎం కేసీఆర్

Last Updated : Dec 30, 2020, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details