సోమాజిగూడలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ - food festivel
తెలంగాణ రుచులను తెలియజేయడానికి హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఫుడ్‌ఫెస్టివల్ 10 రోజుల పాటు కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కారించుకొని సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు కొనసాగే ఈ ఫెస్టివల్‌లో తెలంగాణలో ప్రముఖమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలను భాగ్యనగర భోజన ప్రియులకు అందిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలైన కల్లు కోడి, చుక్కకూర మాంసం, సరువ పిండి, మెంతి కూర పప్పు వంటి వంటకాలను అందిస్తున్నట్లు హోటల్ చెఫ్ తిరుపతిరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడే విధంగా చక్కటి అలంకరణతో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవం భోజన ప్రియుల నోరూరిస్తోంది. ఇవీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం