Telangana Congress MLA Candidates Second List 2023 మరికాసేపట్లో కాంగ్రెస్ రెండో జాబితా.. ఒకట్రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి Telangana Congress MLA Candidates Second List 2023 :రాష్ట్ర శాసనసభ ఎన్నికలకుకాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా(Congress MLA Candidates Second List) దాదాపుగా కొలిక్కి వచ్చింది. 55 మందితో ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ అధిష్ఠానం.. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసింది. ఈ మేరకు ఉదయం ఏఐసీసీ కార్యాలయంలోకాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(Congress Central Election Committee) భేటీ అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్, సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Telangana Congress MLA Candidates List 2023 : కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ మలి విడత అభ్యర్థుల ఎంపిక.. ఇవాళ ఆమోద ముద్ర!
Congress Focus on MLA Candidates in Telangana : స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులు, అభ్యర్థుల ఎంపిక, వామపక్షాలతో పొత్తు అంశంపై గంట పాటు వారు చర్చించారు. పొత్తులో భాగంగా వామపక్షాలకు 4 సీట్లు కేటాయించగా.. అందులో సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్(Telangana Congress) అధిష్ఠానం.. 60 మందితో మలి విడత జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల విషయంలో నాయకుల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో నాలుగైదు మినహా మిగతా స్థానాలన్నింటికీ ఈ సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
'సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశాం. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరింది. ఏ స్థానాలు ఇవ్వాలనే విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది.' -మురళీధరన్, కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్
Telangana Assembly Elections 2023 :అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి, వ్యతిరేకత ఎదురుకాకుండా, పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అసంతృప్త నాయకుల బుజ్జగింపుపై ముఖ్య నేతలు దృష్టి సారించగా.. కొందరితో ఏఐసీసీ నాయకులే నేరుగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలను ఇప్పటికే దిల్లీకి పిలిపించి చర్చించారు. అభ్యర్థుల జాబితా వెలువడుతున్న తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు(Telangana Congress Leaders), ఆశావహులు చివరి ప్రయత్నంగా దిల్లీలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
Telangana Congress Candidates Selection 2023 : రెండో జాబితాపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు.. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!
Telangana Congress MLA Candidates List : నాలుగైదు సీట్లపైనే చిక్కుముడి.. దసరా తర్వాత ఒకేసారి ఫైనల్ జాబితా..!