Telangana Congress MLA Candidates List Delay :అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు.. కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా జాతీయస్థాయిలో వామపక్షాలు కలిసొస్తున్నందున రాష్ట్రంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు చెరో రెండు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. సీపీఐ మునుగోడు, హుస్నాబాద్, సీపీఎం కొత్తగూడెంతో పాటు మరొకస్థానం ఖమ్మంలోనే కావాలని కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిమాండ్ అధికంగా ఉండడంతో సీపీఐకి మునుగోడు, సీపీఎంకి హుస్నాబాద్ ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొత్తగూడెం పొత్తులో భాగంగా సీపీఎంకి ఇవ్వాల్సి వస్తే అక్కడ నుంచి పోటీ చేయనున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరుకు.. అక్కడ పోటీ చేయాలనుకుంటున్న తుమ్మలను ఖమ్మానికి మార్పు చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Delay in Telangana Congress MLA Candidates List 2023 : కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజల్లో ప్రచారం జరుగుతుండడంతో.. పార్టీలో చేరేవాళ్లు అధికం అవుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kasireddy Narayana Reddy), ఆయన అనుచరుడు నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరుకాకుండా మరికొందరు పార్టీలోకి వచ్చేందుకు.. సిద్ధంగా ఉండడంతో చర్చల స్థాయిలో ఉన్నందున ఏదోకటి తేలేవరకు అభ్యర్థుల ప్రకటన(Congres Mla Candidates) జాప్యం జరగనుందని తెలుస్తోంది. దసరా నవరాత్రుల సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని.. కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Congress MLA Candidates List 2023 : మరోవైపు అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే.. తలెత్తే అసంతృప్త జ్వాలలను విజయవంతంగా చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన జరిగిన మరుక్షణమే అసంతృప్తులను ఓదార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏ ఒక్కరు కూడా అసంతృప్తికి లోను అవ్వకూడదని.. ఏఐసీసీ భావిస్తోంది. అభ్యర్థుల గెలుపునకు ఆటంకం ఏర్పడుతున్నట్లు పార్టీ భావిస్తోంది.