తెలంగాణ

telangana

ETV Bharat / state

T Congress Focus on Assembly Elections : కాంగ్రెస్​లో కమిటీల వివాదం.. కష్టపడే వారికే పదవులు ఇవ్వాలి..!

Mandal Committees Controversy in Telangana Congress : రాష్ట్ర కాంగ్రెస్‌లో మండల కమిటీల వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. తమ అనుచరులకు కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ పలువురు నేతలు గాంధీభవన్‌ బాటపట్టారు. పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కమిటీలు వేయడంపై విభేదాలు తలెత్తాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించి ఈ అంశంలో జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి... కమిటీల నియామక అధికారం పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు.

Telangana Congress Focus on Assembly Elections
Telangana Congress Focus on Assembly Elections

By

Published : Jul 7, 2023, 9:23 AM IST

కాంగ్రెస్​లో మండల కమిటీల వివాదం..

Telangana Congress Mandal committees Dispute : ఎన్నికల దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిన కాంగ్రెస్‌.. బూత్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను, పదవులని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండలాల అధ్యక్షులను నియమిస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో కసరత్తు చేపట్టింది.

Revanth Reddy on Mandal Committees Controversy :పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శులు, కార్యనిర్వహక అధ్యక్షులు, ఇంచార్జి ఉపాధ్యక్షులు సమష్టిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కసరత్తు పూర్తైన తర్వాత ఉత్తర్వులు ఇచ్చే ముందు... పీసీసీ అధ్యక్షుడితో చర్చించి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఆర్గనైజింగ్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. రేవంత్‌రెడ్డికి తెలియకుండానే 70 నియోజకవర్గాలకు చెందిన మండలాల అధ్యక్షుల జాబితా విడుదల చేయగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీనిని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

Telangana Assembly Elections 2023 :పార్టీ మండల కమిటీ అధ్యక్షుల విషయంలో తమ అనుకూలమైన వారిని నియమించుకున్నారని పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షులను ప్రకటించారన్న విషయం తనకు తెలియకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న రేవంత్‌.. ఈ అంశంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మండల కమిటీల ప్రకటనకు సంబంధించి జారీచేసే జాబితాలపై సంతకాలు చేసే అధికారం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి ఈ బాధ్యత అప్పగించారు. ఇదే అంశంపై స్పందించినరేవంత్​రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా తాను ఎవరికైనా అప్పగించవచ్చని చెప్పారు. తాజాగా మల్లు రవి 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలకు అధ్యక్షులను నియమించారు.

Telangana Congress Focus on Assembly Elections :కాంగ్రెస్‌లో మండల కమిటీల చిచ్చురేగుతున్న క్రమంలోనే మునుగోడు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన కమిటీల పంచాయితీ గాంధీభవన్‌కు చేరుకుంది. ఈ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు మల్లు రవితో సమావేశం కాగా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందించిన జాబితా మేరకే మండల అధ్యక్షులను నియమించినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కమిటీల్లో అన్యాయం జరిగిందంటూ మునుగోడు ఉపఎన్నిక పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్​రెడ్డి వ్యతిరేకవర్గం నేతలు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. స్రవంతి ఈ సమస్యను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. మల్లు రవి కారు ముందు ఆందోళనకారులు బైఠాయించటంతో పార్టీ కార్యాలయం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది.

పీసీసీ అధ్యక్షుడు, భువనగిరి ఎంపీతో మాట్లాడి.. 2 నియోజవర్గాల్లోని సమస్యను సర్దుబాటు చేస్తామన్న మల్లు రవి హామీతో ఆందోళన విరమించారు. భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోనే కాకుండా పలుమండలాల్లోనూ ఇదే తరహా సమస్య రావటంతో.. ఎవరూ రోడ్డెక్కకుండా అసంతృప్తులను మెప్పించేందుకు పార్టీ నేతలు దృష్టిసారించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details