తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress Clashes : కాంగ్రెస్‌లో కాక రేపుతున్న చేరికలు.. సీనియర్లు వర్సెస్ జూనియర్లతో పార్టీకి తలనొప్పి

Telangana Congress Clashes 2023 : రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్తవారి చేరికలు అధికమవుతుండడంతో.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ అసమ్మతి.. ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్నఆందోళన.. పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. హస్తం పార్టీలో చేరిన నాయకులు జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో కలివిడిగా కలిసిపోయే పరిస్థితులు లేకపోవడంతో.. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని సీనియర్‌ నాయకులు కొందరు హెచ్చరిస్తున్నారు.

Congress
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 7:03 AM IST

Senior Leaders vs Junior Leaders కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు సీనియర్లు వర్సెస్ జూనియర్లు

Telangana Congress Clashes 2023 :కర్ణాటక ఫలితాలు సానుకూలంగా వచ్చి అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు ఊపిరిలూదినట్లయ్యింది. క్రమంగా పార్టీ బలోపేతం అవుతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అత్యధిక వర్గాలను ప్రభావితం చేసే యువ, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించడం.. చేయూత పెన్షన్‌లు, ఆరు హామీల గ్యారెంటీ కార్డుల (Guarantee cards) విడుదల లాంటివి హస్తం పార్టీకి బలాన్ని చేకూర్చాయని విశ్లేషకుల అభిప్రాయం.

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

Telangana Congress Disputes 2023 :ఇదే సమయంలో బీజేపీలో అంతర్గత విబేధాలతో.. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరికొంత లాభాన్ని చేకూర్చాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కాస్త పుంజుకోవడంతో పాటు.. బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి పార్టీలకు చెందిన పలువురు నాయకులు హస్తం వైపు మొగ్గు చూపారు. మరికొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు (Congress Joinings) చొరవ చూపినా.. వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానిక సామాజిక సమీకరణాలు సరిపోకపోవడంతో.. నిరాకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : "కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది"

Telangana Congress Seniors Vs Juniors : శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకున్నాయి. అయితే పార్టీలోకి చేరికలతో పాత వారిలో ఆందోళన మొదలైంది. డీసీసీ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు తెలియకుండా హస్తం పార్టీలో చేర్చుకుంటూ వస్తుండడంతో స్థానిక నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమకే టికెట్‌ దక్కుతుందంటూ.. అప్పటి వరకు పని చేసుకుంటూ వచ్చిన నాయకుల్లో అభద్రతాభావం ఏర్పడింది.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వారు డీసీసీలతో కానీ, నియోజకవర్గ నేతలతో కానీ కలిసిపోకపోవడం.. పాత నాయకులకు ఇబ్బందిగా మారిందని పార్టీ సీనియర్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మైనంపల్లి (Mynampally) చేరికతో.. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌లు పార్టీని వీడారు. ఆ ఇద్దరూ తమకు టికెట్లు వస్తాయని ఆశించి భంగపాటుకు గురై.. హస్తం పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్​పై ఏఐసీసీ ఫైర్

ఎన్నికల సమయంలో.. నాయకులు అటూ ఇటూ జంపింగ్‌లు చేయడం సర్వసాధారణం. కానీ తాజాగా చేరికల విషయంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసమ్మతిచెలరేగకుండా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కుదర్చాల్సిన అవసరం ఉంది. లేదంటే టికెట్ల ప్రకటన వచ్చిన మరుక్షణమే పెల్లుబికే అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.

Telangana Congress Bus Yatra 2023 :ఈ నెల 14 లేదా 15వ తేదీ నుంచి బస్సు యాత్ర (Bus Yatra ) చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలంటే క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విబేధాలు సమసిపోవాల్సి ఉంది. కొత్తవారొచ్చినా.. పాతవారు నష్టపోకుండా... పోటీ చేసే అవకాశం కోల్పోతున్న నేతలకు పార్టీ అధికారంలోకి వస్తే.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలి. దాంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న అభిప్రాయం హస్తం పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతోంది.

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Congress Flash Survey Telangana : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీద మరో లెక్క.. టెన్షన్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు

ABOUT THE AUTHOR

...view details