Telangana Cabinet Meeting On 5th This Month: రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. ఈ నెల ఐదో తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ ప్రగతిభవన్‌లో భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో చర్చిస్తారు. మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షత.. 5న మంత్రి వర్గ సమావేశం
Telangana Cabinet Meeting: ఈ నెల 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం కానుంది. ఈ నెల 5వ తేదీన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, విపక్షాలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై చర్చించనున్నారు.
సీఎం కేసీఆర్
బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్లో చర్చిస్తారు. ఇతర పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి: