ఇవాళ తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానుంది. 2020-21 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపటంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
బడ్జెట్ ఆమోదానికి నేడు మంత్రిమండలి సమావేశం - telangana budgetsessions
బడ్జెట్‌కు ఆమోదం తెలపడం కోసం ఇవాళ రాష్ట్ర మంత్రిమర్గం సమావేశం కానుంది. హైదరాబాద్ ప్రగతి భవన్లో ఈ రోజు రాత్రి 7 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది.
బడ్జెట్ ఆమోదానికి నేడు మంత్రిమండలి సమావేశం
ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి వర్సిటీకో చట్టంచేయాల్సి ఉంది. వీటిని మంత్రిమండలి ఆమోదించనుంది. రాష్ట్ర లోకాయుక్త చట్టసవరణ, ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులను లాభదాయక జాబితా నుంచి తొలగించడం వంటి బిల్లులను ప్రవేశపెట్టేందుకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం
Last Updated : Mar 7, 2020, 7:54 AM IST