తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌..!

తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రజల ఆకాంక్షలకు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవిక అంచనాలతో రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌..!

By

Published : Sep 6, 2019, 6:28 AM IST

Updated : Sep 6, 2019, 9:31 AM IST

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌..!

రాష్ట్ర బడ్జెట్‌ను తగిన ప్రాధాన్యాంశాలకు పెద్దపీట వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ నెల 9 నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని 2019-20 పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులను పరిగణనలోనికి తీసుకొని పూర్తిస్థాయి బడ్జెట్‌ను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. శాఖల వారీగా వచ్చిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది కేటాయింపులను ఖరారు చేయాలని అన్నారు. ఏప్రిల్‌ నుంచి మొదటి త్రైమాసికంలో నిధుల వినియోగం, పెండింగు పనుల గురించి చర్చించారు. ఆయా శాఖల అభివృద్ధికి నిధులపైనా కసరత్తు చేశారు.

Last Updated : Sep 6, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details