తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్ - తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు

Telangana Assembly Elections Results 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకూ ఈ నిబంధన వర్తిసుందని అధికారులు ఆదేశించారు.

Telangana Election Results 2023
Liquor Shops and Starhotels Closed on Counting Day

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 1:38 PM IST

Updated : Dec 2, 2023, 1:56 PM IST

Telangana Assembly Elections Results 2023 : రాష్ట్రంలో డిసెంబర్ 3న శాసనసభ ఎన్నికల కీలక ఘట్టానికి తెరపడనుంది. ఆదివారం రోజున ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్నికల ఫలితాలు(Telangana Elections) వెలువడనున్న వేళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు.

Wine Shops Closed in Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లు కూడా మూసివేయాలని ఆదేశించారు.

Restaurants Closed in Hyderabad : హైదరాబాద్​లో ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర సీపీ సందీప్‌ శాండిల్య హెచ్చరించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 15 కౌంటింగ్‌ కేంద్రాలున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమికూడదని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమికూడటం, సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించారు. ప్రజలను ఉద్దేశించి మైకుల్లో ప్రచారం, సమావేశాలు, ఆటపాటలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

కౌంటింగ్​కు వేళాయే - రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Telangana Election Counting Security : ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఫలితాలు వెలువడం మొదలు కాగానే అభ్యర్థులు, రాజకీయపార్టీల నాయకులు భావోద్వేగాలకు లోనై హడావుడి సృష్టించడం, బాణసంచా కాల్చకుండా నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా హంగామా సృష్టించినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలను రద్దీలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

నాయకులు, అభ్యర్థులు గొడవలు సృష్టించినా, పోలీసులు వారిని పట్టుకునేందుకు వీలుగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియం, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వంటివాటిలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. సమస్యాత్మక నియోజకవర్గాల లెక్కింపును మైదానాలు, స్టేడియంలలో ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు వందల సంఖ్యలో వచ్చినా వాహనాలు ఉంచేందుకు పార్కింగ్‌ వసతిని కల్పించారు.

ఈవీఎం యంత్రాలను పంపిణీ చేసిన కేంద్రాలనే ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఎంపిక చేశారు. ఈవీఎం పంపిణీ కేంద్రాలకు పక్కనే లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను ఉంచాక వాటి భద్రతను రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు. ఆర్వో సూచనతో లెక్కింపు కేంద్రం వద్ద సశస్త్ర సీమ బల్‌ బలగాలు, తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ సాయుధ బలగాలు, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులను నియమించారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక ప్లటూన్‌ సశస్త్ర సీమ బల్‌ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. వీరికి అక్కడే వసతి కల్పించారు. నిరంతర భద్రత ఉన్నా.. అనుమానాస్పద సంఘటనలు, వ్యక్తులు సంచరిస్తే వెంటనే గుర్తించేందుకు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చారు.

తెలంగాణలో 70.79% పోలింగ్‌ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు

Last Updated : Dec 2, 2023, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details