Telangana Assembly Elections Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత రాజుకుంటోంది. ప్రధానంగా మూడు పార్టీల నడుమ త్రిముఖ పోరు ప్రతిబింబిస్తోంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు(BRS Candidates) నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కాలనీల్లో ప్రచారం నిర్వహించిన దానం నాగేందర్.. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌లో పద్మారావుగౌడ్ తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు.
Minister Srinivas Yadav Election Campaign Start :సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట డివిజన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ గులాబీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో పలువురు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం లింగాల ఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన కారు పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి.. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు నమ్మొద్దని సూచించారు.
తెలంగాణ విపక్ష పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం ఇచ్చి.. ఎన్నికల సందర్భంగా నగదు బదిలీ పథకాలన్నీ ఆపివేయాలని విజ్ఞప్తి చేశాయి. నగదు బదిలీ పథకాలు అంటే.. మన బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న రుణమాఫీ, దళితబంధు, రైతుబంధు స్కీమ్‌లు. ఈ మూడు కూడా కొత్త పథకాలు కావు. ఎన్నికల నియమావళి ప్రకారం పాత పథకాలన్నీ కొనసాగించుకోవచ్చు. కానీ నగదు బదిలీ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందనే దురుద్దేశంతో ఆ ఇరు పార్టీలు ఈ పథకాలన్నింటినీ నిలిపివేయాలని ఈసీని కోరాయి. - కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి
MLA Sitakka Door-to-Door Election Campaign :కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. హుస్నాబాద్ బీజేపీ పట్టణ నాయకులు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పలు గ్రామాలలో పాదయాత్ర ప్రచారం చేస్తున్నారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆరు గ్యారంటీలను(Congress Six Guarantees) వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు.