తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుభవజ్ఞులతో నూతన ప్రాజెక్ట్​ డిజైన్​లను రూపొందించండి: శ్రీనివాస్​ గౌడ్

తెలంగాణను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దటానికి రూపొందించిన నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనల అమలుపై ఉన్నతాధికారులతో పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్​లు రూపొందించిన ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్​లను మంత్రి పరిశీలించారు.

అనుభవజ్ఞులతో నూతన ప్రాజెక్ట్​ డిజైన్​లను రూపొందించండి: శ్రీనివాస్​ గౌడ్
అనుభవజ్ఞులతో నూతన ప్రాజెక్ట్​ డిజైన్​లను రూపొందించండి: శ్రీనివాస్​ గౌడ్

By

Published : Oct 8, 2020, 12:16 AM IST

తెలంగాణను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దటానికి రూపొందించిన నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనల అమలుపై ఉన్నతాధికారులతో పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్షించారు. టూరిజం ప్రాజెక్టుల కోసం నిర్దేశిత ప్రతిపాదిత స్థలాల్లో ప్రాజెక్టుల డిజైన్​లను అనుభవం ఉన్న కన్సల్టెంట్​ల ద్వారా రూపొందించాలని సూచించారు. వాటిని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికై నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్​లు రూపొందించిన ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్​లను మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ మోనో రైల్ ప్రాజెక్ట్​పై హెచ్‌ఎండీఏ అధికారులతో సంప్రదించి.. ప్రాజెక్టు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రముఖ సంస్థలతో చర్చించి దుర్గం చెరువుతోపాటు కాళేశ్వరం, మిడ్ మానేరు, కొండ పోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఇదీ చదవండి:పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details