తెలంగాణ ఏర్పాటైన తర్వాత నూతనంగా 12 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు.
'నకిలీ, నాణ్యత లేని ఇంజినీరింగ్ కళాశాలలు మూసివేస్తాం'
దోస్త్ ఆన్‌లైన్ విధానం ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. శాసన సభ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై చర్చ జరిగింది.
'నకిలీ, నాణ్యత లేని ఇంజినీరింగ్ కళాశాలలు మూసివేస్తాం'
నకిలీ, నాణ్యతలేని ఇంజినీరింగ్ కళాశాలలు మూసివేసేలా చర్యలు చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య కోసం చర్యలు చేపట్టామని... అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాని పేర్కొన్నారు. కొన్ని సమస్యలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఆటంకంగా మారాయని తెలిపారు.
ఇదీ చూడండి:భారత్లో 107కు చేరుకున్న కరోనా కేసులు