సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్లో కరోనా కలకలం రేగింది. ఏడో అంతస్తులో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ పొరుగుసేవల సిబ్బందికి పాజిటివ్ వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు, సిబ్బంది హోంక్వారంటైన్లోకి వెళ్లారు.
సచివాలయం, జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం - సచివాలయ ఉద్యోగికి కరోనా
11:58 June 08
సచివాలయంలో కరోనా కలకలం
కొన్నాళ్ల క్రితం తమ బంధువుల్లో ఒకరి అంత్యక్రియలకు సదరు ఉద్యోగి హాజరయ్యారు. అతణ్ని కొంతకాలం విధులకు హాజరు కానివ్వలేదు. తాజాగా కరోనా పాజిటివ్ నేపథ్యంలో ఆ అంతస్తులో ఆర్థికశాఖ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హోంక్వారంటైన్లోకి వెళ్లారు.
ఎనిమిదో అంతస్తులోనూ ఆర్థికశాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇవాళ విధులకు హాజరు కాలేదు. కొందరు విధులకు వచ్చి మళ్లీ ఇళ్లకు తిరిగివెళ్లారు.
జీహెచ్ఎంసీ భవన్లోనూ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా సోకింది. 4వ అంతస్తులో ఓ సెక్షన్లో పనిచేసే ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణతో అధికారులు అప్రమత్తమయ్యారు. 4వ అంతస్తులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇళ్లకు పంపించారు. 4వ అంతస్తులో శానిటైజేషన్ చేయిస్తున్నారు.