షేక్‌పేట్ తహసీల్దార్, ఆర్ఐలను అనిశాకు పట్టించిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి ఫోర్జరీ పత్రాలు సృష్టించాడు. ఆ పత్రాలనే రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాడు. ఎలాగైనా ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్సైకి లంచం ఆశ చూపించాడు. రూ. 15 లక్షలు లంచం ఇచ్చి షేక్‌పేట్ ఆర్ఐని అనిశాకు పట్టించాడు.
షేక్‌పేట్ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు - సీసీఎస్ పోలీసుల తాజా సమాచారం
ఓ వ్యక్తి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పథకం పన్నాడు. అందుకోసం ప్రభుత్వ అధికారులకు లంచం ఎర చూపాడు. కక్కుర్తి పడిన అధికారులకు రూ.15 లక్షల లంచం ఇస్తూ వారిని అడ్డంగా అనిశా అధికారులకు పట్టించాడు. ఈ తతంగంలో ఓ తహసీల్దార్, ఆర్ఐ, ఎస్సైలను పోలీసులు అరెస్టు చేశారు. తీరా నిజం తెలిశాక ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తిని తాజాగా అరెస్టు చేశారు.
అంతకంటే ముందే లంచం తీసుకున్న బంజారాహిల్స్ ఎస్సైని కూడా అనిశా అధికారులు అదే రోజు అరెస్ట్ చేశారు. ఇందులో తహసీల్దార్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెనూ అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సయ్యద్ అబ్దుల్ ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు అనిశా అధికారులు గుర్తించారు. సీసీఎస్‌లో అబ్దుల్ సయ్యద్‌పై అనిశా అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సయ్యద్ అబ్దుల్, అతనికి సహకరించిన అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి :'ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటీఆర్ సమయం కేటాయించాలి'