ఉపాధ్యాయ సాంకేతిక అర్హత శిక్షణ(టీటీసీసీ) కోసం ఈ నెల 17 నుంచి నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కోసం గత నాలుగు రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నెల 17 నుంచి మే 28 వరకు 42 రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు.
డ్రాయింగ్, టైలరింగ్, సంగీతంలో శిక్షణ ఇవ్వనున్నారు. సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి నిమిత్తం బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. గత రెండేళ్లుగా ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని శిక్షకుడు రంజిత్ రెడ్డి తెలిపారు.
ఉపాధి కోసం ఉపాధ్యాయ సాంకేతిక అర్హత శిక్షణ - CERTIFICATE COURSE
ప్రభుత్వ ఉద్యోగం కోసం, డ్రాయింగ్, టైలరింగ్, సంగీతం వంటి రంగాల్లో టీటీసీసీ శిక్షణ ఇవ్వనుంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన వారికి గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు వస్త్తుండటం వల్ల ఈ కోర్సుకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఈ నెల 17 నుంచి నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ప్రారంభం
ఇవీ చూడండి : నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు