తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉన్నతీకరణకై భాషాపండితుల ఆందోళన - భాషాపండితులు

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితులు, పీఈటీల ఉన్నతీకరణలకై ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి భాషా పండితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతీకరణకై ఆందోళన చేపడుతున్న ఉపాధ్యాయులు

By

Published : Aug 18, 2019, 2:06 PM IST

రాష్ట్ర ప్రభుత్వం భాషాపండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయాలంటూ ఉపాధ్యాయులు రాష్ట్ర రాజధానిలో ఆందోళన చేపట్టారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని పలువురు ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై వారి దీక్షకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి భాషా పండితులకు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నించారు. భాషా పండితులు, పీఈటీలకు ఉన్నతీకరణ కల్పించే విధంగా జీవో నెంబర్ 15 అమలు చేయాలని వ్యాయామ విద్య ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు సోమేశ్వరరావు కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా పండితులకు సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు.

ఉన్నతీకరణకై ఆందోళన చేపడుతున్న ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details