తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి ప్రైవేట్​ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం - private teachers

పాఠశాలల మూసివేతతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2వేల ఆపత్కాల సాయం నేటి నుంచి అందనుంది. సాయం అందుకునే ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య లక్షా 24వేల 704 గా తేలింది. ఇందులో ఉపాధ్యాయులు లక్షా 12వేల 48 మంది కాగా.. 12వేల 636 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.

telangana latest news
ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం

By

Published : Apr 19, 2021, 7:53 PM IST

Updated : Apr 20, 2021, 4:28 AM IST

రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి నేటి నుంచి రూ.2 వేల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,704 మంది లబ్ధి పొందనున్నారు.

రాష్ట్రంలోని 10,923 ప్రైవేటు విద్యాసంస్థల్లో జిల్లా విద్యా సమాచార వ్యవస్థ సమాచారం ప్రకారం 1,35, 329 మంది ఉపాధ్యాయులు, 10,987 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. మొత్తం 1,46,316 మంది ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కోసం 2,09,873 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,56,000 మంది ఉపాధ్యాయులు కాగా.. 53,71 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఆ వివరాలన్నింటినీ పరిశీలించి జిల్లా విద్యా సమాచార వ్యవస్థ డేటాతో సరిచూశాక 1, 24,704 మంది అర్హులుగా తేల్చారు. అందులో ఉపాధ్యాయులు 1,12,048 మంది కాగా.. బోధనేతర సిబ్బంది 12,636 ఉన్నారు. యూడైస్ డేటాలో పేర్లు లేకపోవడం వల్ల మిగిలిన అప్లికేషన్లను విద్యాశాఖ పక్కనపెట్టింది. పక్కన పెట్టిన దరఖాస్తులు దాదాపు 86 వేలు ఉన్నాయి.

ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 2 వేల రూపాయల ఆర్థిక సాయం జమచేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రేపటి నుంచి 25 వరకు కుటుంబానికి 25 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు.

ఇదీ చదవండి:ఫార్మా సంస్థలు, ప్రముఖ వైద్యులతో మోదీ భేటీ

Last Updated : Apr 20, 2021, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details