తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయ, ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం

సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ, కాంట్రాక్ట్​ ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ పేరుతో ఇందిరాపార్క్​ ధర్నాచౌక్​ నుంచి అసెంబ్లీ వద్దకు వెళ్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

teachers and employee unions protest
ఉపాధ్యాయ, ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం

By

Published : Mar 13, 2020, 5:22 PM IST

పీఆర్సీ అమలు.. ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్​ నుంచి అసెంబ్లీ వద్దకు వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి అంబర్​పేట, గోషామహల్ పోలీస్​స్టేషన్​లకు తరలించారు.

అరెస్టు క్రమంలో ఉద్యోగుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తించారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులు గాయపడ్డారు.

ఉపాధ్యాయ, ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం

ఇదీ చూడండి:బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details