ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత నెల రోజులుగా అనేక డివిజన్ల నేతలతో సమావేశాలను నిర్వహించామన్నారు.
'గ్రేటర్లో ఓటు అడిగే హక్కు తెదేపాకు మాత్రమే ఉంది' - etv bharath
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు బరిలో దిగుతారన్న ఆయన... నేడు, రేపో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నేడు, రేపో తెదేపా అభ్యర్థుల జాబితా: ఎల్.రమణ
స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించనున్నట్లు పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువస్థానాల్లో తెదేపా అభ్యర్థులు బరిలో దిగుతారన్న ఆయన... నేడు, రేపో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనని... ఇక్కడ ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని రమణ అన్నారు.
ఇదీ చదవండి:రేపటిలోగా అభ్యర్థుల ఖరారు