నేడు ప్రగతిభవన్లో తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో దాదాపుగా రెండు లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న మెట్ట, ఆరుతడి పంటలకు నీటి సమస్య ఉందని సీఎంకు వివరించారు. పదిరోజుల పాటు నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. సండ్ర విజ్ఞప్తిపై స్పందించిన సీఎం... వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషిని ఆదేశించారు.