టాటా ట్రస్ట్ సంస్థ సీనియర్ సిటిజన్లకు సహాయ సహకారాలు అందించనుంది. టాటా ట్రస్ట్ ఎలర్ట్ స్ప్రింగ్ కార్యక్రమం ద్వారా రెస్పాన్స్ సిస్టమ్ డిజైన్ చేసింది. ఇందుకోసం 14567 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి నగరంలోని సీనియర్ సిటిజన్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సేవలను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి సుగంధి బలిగ తెలిపారు. సీనియర్ సిటిజన్ల అవసరాలను గుర్తించడంతోపాటు...ఆ అవసరాలను తీర్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ అన్నారు.
సీనియర్ సిటిజన్స్‌కు టాటా ట్రస్ట్ సాయం - tata
గ్రేటర్ హైదరాబాద్‌లో సీనియర్ సిటిజన్లకు అవసరమైన సమాచారం అందించడం, మార్గనిర్దేశకం చేయడం, సహాయ, సహకారాలు అందించేందుకు టాటా ట్రస్ట్ సంస్థ ముందుకొచ్చింది. టాటా ట్రస్ట్ ఎలర్ట్ స్ప్రింగ్ కార్యక్రమం ద్వారా రెస్పాన్స్ సిస్టమ్ డిజైన్ చేసింది.
సీనియర్ సిటిజన్స్‌కు టాటా ట్రస్ట్ సాయం