Talasani comments on BJP: విజయం కోసం భాజపా ఎన్ని కుట్రలైనా చేస్తుందని ప్రజలు వాటిని నమ్మ వద్దని మునుగోడు ప్రజలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని హితవు పలికారు. భాజపా నాయకులు దాడి, గాయాలంటూ నాటకాలు ఆడుతున్నారన్నారని ఆరోపించారు. మళ్లీ ఆ నెపాన్ని తెరాస పార్టీ మీద నెట్టేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలో ఓటమి పాలవుతామనే భయంతో ఇటువంటి కుయుక్తులకు పూనుకుంటున్నారన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నిన తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాజగోపాల్రెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. ఇది అతని స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపఎన్నికను తీసుకువచ్చారన్నారు. రాజగోపాల్రెడ్డి ఇంతకు ముందు ఎమ్మెల్యేనే.. మళ్లీ గెలిస్తే మాత్రం ఏమవుతారు ఎమ్మెల్యేనే కదా అని నవ్వుకున్నారు. కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి, భాజపాలోకి పారిపోయారని దుయ్యబట్టారు.