రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవని... ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి తలసాని
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలు మొహరించారు.
మంత్రి తలసాని