తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితరంగంలో అంకురాలకు ప్రోత్సాహం - STARTUPS

హరిత రంగంలో పనిచేస్తున్న అంకురాలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్​లో భారత పరిశ్రమల సమాఖ్య- సొరబ్జీ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ టీ-హబ్​తో జతకట్టింది.

హరిత రంగంలో అంకురాలకు ప్రోత్సహం

By

Published : Sep 1, 2019, 12:47 AM IST

Updated : Sep 1, 2019, 11:55 AM IST

హరిత రంగంలో అంకురాలకు ప్రోత్సహం

సీఐఐ-జీబీసీ 15వ ఫౌండేషన్​ డే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్, సీసీఐ తెలంగాణ ఛైర్మన్ రాజు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హరిత భవనాలపై పరిశోధన, వాటిపై పని చేస్తున్న అంకురాలను ప్రోత్సహించేందుకు ఐఐటీ మద్రాసుతో సీఐఐ-జీబీసీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది.

ఈ కార్యక్రమానికి సీఐఐ-జీబీసీ ఛైర్మన్ జమ్షద్ ఎన్ గోద్రేజ్, తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా హాజరయ్యారు. హరిత భవనాల స్థలం విషయంలో భారత్ రెండో స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలోకి వస్తుందని జమ్షద్ ఎన్ గోద్రేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరిత తెలంగాణ సాధన దిశగా పనిచేస్తుందని అజయ్ మిశ్రా పేర్కొన్నారు.

ఇదీ చూడండి : "కరీంనగర్ రావడానికి ఒక సెటిమెంటల్ కారణముంది"

Last Updated : Sep 1, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details