ధనబలం, నేర చరిత్ర కలిగిన వాళ్లనే రాజకీయ పార్టీలు పోటీపడి బరిలో నిలబెడుతున్నాయని శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బోయిన్పల్లిలో విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ కె.స్వామి గౌడ్‌లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పేరుకే రెడ్డి కానీ.. ఆయన బడుగు, బలహీన వర్గాలకు బలమైన వెన్నుపూస లాంటి వారని స్వామిగౌడ్ కొనియాడారు.
యువత రాజకీయాల్లోకి రావాలి : స్వామిగౌడ్ - శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తాజా వార్తలు
పలు పార్టీలు డబ్బులు ఉన్న వాళ్లనే ఎన్నికల బరిలో నిలబెడుతున్నాయని శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ముందుగా ప్రజలు చైతన్యం కావాలని కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పాపన్న చేసిన పోరాటం గుర్తుతెచ్చుకోవాలని పేర్కొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి : స్వామిగౌడ్
బడుగు, బలహీన వర్గాలకు ఆసరాగా నిలబడే నాయకులకు అండగా నిలబడాలని కోరారు. యువత రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలని ఆయన సూచించారు. సర్వాయి పాపన్న చేసిన సేవలను స్వామిగౌడ్ కొనియాడారు. బడుగు బలహీన వర్గాల బిడ్డల్ని వారి హక్కుల్ని కాపాడారని అన్నారు.
ఇదీ చూడండి :ఆ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదు : రేవంత్ రెడ్డి