హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిబ్బందికి టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో స్వామిగౌడ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి మహమ్మారి కరోనా వ్యాధిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్రాల సూచనలు పాటించాలన్నారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సిబ్బందికి సరకులు పంపిణీ చేసిన స్వామిగౌడ్ - టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సిబ్బందికి సరకులు పంపిణీ చేసిన స్వామిగౌడ్
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో పేదలు ఉపాధి కరవై ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దాతలు, సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఈ తరుణంలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిబ్బందికి టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో స్వామిగౌడ్ సరకులు అందజేశారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సిబ్బందికి సరకులు పంపిణీ చేసిన స్వామిగౌడ్
అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకు వెళ్లకుండా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేయాలన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలకృషికి దేశ, రాష్ట్ర ప్రజలకు స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :హైజీనిక్ కండిషన్లోకి శంషాబాద్ విమానాశ్రయం
Last Updated : May 13, 2020, 4:08 PM IST