దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌరస్తా రోడ్డుపై స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. చైనా దేశ జాతీయ జెండాను దగ్ధం చేశారు. సమీపంలో ఉన్న చైనా బజార్ వద్దకు వెళ్లి ఫ్లెక్సీ బోర్డును ధ్వంసం చేశారు. ఆ దేశ వస్తువులు అమ్మొద్దని షాపులో వస్తువులు బయటకు తీసుకొచ్చి పగలగొట్టారు.
'చైనా బజార్ ఫ్లెక్సీ ధ్వంసం.. ఆ వస్తువులు అమ్మొద్దని నిరసన'
భారత సైన్యంపై చైనా సైనికులు చేసిన దాడికి పలు సంఘాలు, వ్యక్తులు అనేక రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనా బజార్ షాప్ వద్ద ఆ దేశ వస్తువులు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌరస్తా రోడ్డుపై స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చైనా బజార్ షాపు ఫ్లెక్సీ ధ్వసం చేశారు.
'చైనా బజార్ ధ్వసం.. ఆ వస్తువులు వాడొద్దు'
హైదరాబాద్ భారత్-చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయలో చైనా సైనికులు భారత సైన్యంపై రాళ్లు, కర్రలు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఆ దాడితో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు మృతికి నిరసనగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :బతుకు బండికే ఉరి... ఆశల పల్లకీనే వైకుంఠ రథమైంది!