పెళ్లి బరాత్ వల్ల ఇబ్బంది కలుగుతోందని రాయదుర్గం పోలీసుకు రాత్రి 11.30 గంటలకు ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్లను పంపించేశారు. కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ వచ్చింది. ఈ సారి పోలీసులు అక్కడ ఉన్నవాళ్లను చెదరగొట్టారు. ఈ క్రమంలో బ్యాండ్ యువకులు పరుగులు తీశారు. తప్పించుకునే ప్రయత్నంలో నరేశ్(30) వాహనంలో నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి.
నరేశ్‌ను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని రామగిరి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.