ప్రముఖ రంగస్థల సీనియర్ నటి సురభి ఆవేటి జమునా రాయలు కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ చందానగర్ సురభి కాలనీలో నివాసం ఉంటున్న జమునాకు కరోనా సోకగా.. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చేర్చారు. అనంతరం గాంధీకి తరలించారు. చికిత్స పొందుతూ 60 ఏళ్ల సురభి రాయలు తుది శ్వాస విడిచారు. ఆమె భర్త శ్రీకృష్ణ దేవరాయలు కాగా... ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
కరోనాతో ప్రముఖ రంగస్థల నటి జమునా రాయలు మృతి
కరోనా మహమ్మారి ప్రముఖ రంగస్థల సీనియర్ నటి జమునా రాయలును బలితీసుకుంది. కరోనాతో గచ్చిబౌలి టిమ్స్‌లో చేరిన ఆమెను... గాంధీని తరలించారు. చికిత్స పొందుతూ జమునా తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల జమునా... నటిగా మెప్పించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
surabhi rayalu death with corona
తెలుగు రాష్ట్రాల్లో రంగస్థల నటిగా జమునా గొప్ప పేరు తెచ్చుకున్నారు. సత్యభామగా, శ్రీకృష్ణుడిగా, చంద్రమతిగా ఆమె నటించి మెప్పించారు. ముఖ్యంగా శశిరేఖాపరిణయం నాటికకు దర్శకత్వం వహించి నంది అవార్డును అందుకున్నారు. అనేక రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు. పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం జమునా సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఆమె మృతితో సురభి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.