తెలంగాణలో 2015లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం, సీబీఐ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
పోలీసు నియామకాల్లో అన్యాయంపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజా వార్తలు
రాష్ట్రంలో 2015లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ధర్మాసనం సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం, సీబీఐ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది.
పోలీసు నియామకాల్లో అన్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు
ఆ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో సాంకేతిక కారణాలతో పిటిషన్ కొట్టివేయడం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చూడండి :ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం.. 'గో బ్యాక్ ట్రంప్' నినాదాలు