supreme court: పదేపదే సమయమెందుకు కోరుతున్నారు.. దిశ కేసులో సుప్రీం - సుప్రీ కోర్టు తాజా వార్తలు
12:42 August 03
supreme court: పదేపదే సమయమెందుకు కోరుతున్నారు.. దిశ కేసులో సుప్రీం
సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ జరిగింది. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. మరో ఆరు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. పదేపదే సమయమెందుకు కోరుతున్నారని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఇంకా ఎంతమందిని ప్రశ్నించాలని అడిగారు.
కొవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వొద్దని పిటిషనర్ మణి ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు సమయమిస్తూ సుప్రీం కోర్టు కేసు విచారణను వాయిదా వేశారు.
ఇదీ చదవండి:CBSE result 2021: పదో తరగతి ఫలితాలు విడుదల