తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమార్తెతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో సూపర్​స్టార్​ రజనీకాంత్​ - Kadapa Pedda Dargah Latest News

RAJINIKANTH VISITS TIRUMALA : తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. తితిదే ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు.

RAJINIKANTH Visits TIRUMALA
RAJINIKANTH Visits TIRUMALA

By

Published : Dec 15, 2022, 2:25 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్​..

RAJINIKANTH VISITS TIRUMALA : సూపర్​స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుమార్తె ఐశ్వర్యతో కలిసి పాల్గొన్నారు. తితిదే ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం మూలమూర్తిని దర్శించుకున్న సూపర్​స్టార్.. స్వామివారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

అనంతరం రజనీకాంత్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్​తో కలిసి కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. కుమార్తె ఐశ్వర్యతో పాటు, రెహమాన్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. దర్గా ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో పెద్ద దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details