ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని భానుడి కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం ఆరు నిమిషాల పాటు సూర్య కిరణాలు మూల విరాట్‌ను స్పృశించిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఆ సమయంలో స్వామి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించి పోయారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు
ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.