ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని భానుడి కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం ఆరు నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు
ఏపీ శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఆ సమయంలో స్వామి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించిపోయారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు
ఏటా మార్చి 9,10 తేదీల్లో స్వామిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.
- ఇదీ చూడండి:మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు