తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఇంటర్​ విద్యార్థిని మరణానికి బాధ్యులెవరు?

భవిష్యత్​పై ఎన్నో ఆశలు... ఉన్నతంగా ఎదగాలని కలలు... ఆ దిశగా కష్టపడి చదివి ఇంటర్​ పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఫెయిల్​ అని వచ్చింది. తట్టుకోలేని ఆ చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కానీ రీ వెరిఫికేషన్​లో ఆ అమ్మాయి పాస్​ అయింది. ఏం లాభం... అప్పటికే ఆ బంగారు తల్లి లోకం విడిచి వెళ్లిపోయింది. ఈ విద్యార్థిని మరణానికి కారణం ఎవరు? ఇంటర్​ బోర్డా... ప్రభుత్వమా?

అనామిక

By

Published : Jun 1, 2019, 7:56 PM IST

ఈ ఇంటర్​ విద్యార్థిని మరణానికి బాధ్యులెవరు?

అనామిక అనే విద్యార్థినికి ఇంటర్​ ఫలితాలు వచ్చినప్పుడు తెలుగులో 20 మార్కులు వచ్చి ఫెయిల్​ అయింది. మనస్తాపం చెందిన అనామిక ఆత్మహత్య చేసుకుంది. రీ వెరిఫికేషన్​లో ఆ విద్యార్థినికి 48 మార్కులు వచ్చినట్లు ఆమె సోదరి హైదరాబాద్​ ముక్దూం భవన్​లో తెలిపారు. తన చెల్లిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని కన్నీరు పెట్టుకున్నారు. అనామిక మృతికి కారణమైన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వానిదే బాధ్యత

ఏప్రిల్18న ఫలితాల్లో 3 లక్షల మందికి పైగా పిల్లలు పాస్ కాలేదని బోర్డ్ చెప్పిందని గుర్తు చేశారు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు. మొన్న రీ వెరిఫికేషన్ తర్వాత చూస్తే అనామిక పాస్ అయినట్టుగా ఫలితం వచ్చిందని... ఇప్పుడు ఆమె మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.

ఇవీ చూడండి:అదృశ్యమైన బాలుర మృతదేహాలు చెక్కపెట్టెలో లభ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details