సైబర్ ఆధారిత లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలపై అవగాహన, ఆన్లైన్లో ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయంలో మహిళలు, యువతను మరింత చైతన్యం చేయాల్సిన అవసరముందని పలువురు పోలీసు అధికారులు, ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న 'సైబ్-హర్' కార్యక్రమంలో భాగంగా 'సైబర్ స్పేస్ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా అరికట్టడం' అనే అంశంపై వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు.
మహిళల రక్షణ కోసం విజయవంతంగా 'సైబ్-హర్' కార్యక్రమం - మహిళల రక్షణ కోసం విజయవంతంగా 'సైబ్-హర్' కార్యక్రమం
తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న 'సైబ్-హర్' కార్యక్రమంలో భాగంగా 'సైబర్ స్పేస్ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా అరికట్టడం' అనే అంశంపై వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. 'సైబ్-హర్' ద్వారా చైతన్యం పొంది మహిళలు, యువతీయువకులు ధైర్యంగా పోలీస్ స్టేషన్, సీసీఎస్, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
మహిళల రక్షణ కోసం విజయవంతంగా 'సైబ్-హర్' కార్యక్రమం
ఇప్పటికీ సోషల్ మీడియా ఉపయోగించే చాలామంది యువతీ, యువకులు, మహిళలు సైబర్ ఆధారిత లైంగిక దాడులకు గురవుతున్నారని.. అయితే 'సైబ్-హర్' ద్వారా చైతన్యం పొంది ధైర్యంగా పోలీస్ స్టేషన్, సీసీఎస్, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేస్తున్నారని మహబూబ్నగర్ ఎస్పీ రాజేశ్వరి పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇంటర్నెట్ వాడకం రెండు-మూడింతలు పెరిగిందని.. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఈ విషయంపై శ్రద్ధ పెట్టి.. పిల్లల అంతర్జాల వాడకంపై ఓ కన్నేసి ఉంచాలని ఆమె సూచించారు.
TAGGED:
Women safety