యూపీలో పోలీసులు ముస్లింలను వారి కుటుంబాలను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులు హైదరాబాద్‌లో ఆరోపించారు. పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 15నగరాల్లో జరిగిన వాస్తవ పరిస్థితులను ఒక వీడియో రూపంలో చూపించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యూపీలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఘటనలపై మాట్లాడారు.
సమావేశంలో జేఎన్‌యూ, జామియా, హెచ్‌సీయూ యూనివర్సిటీల విద్యార్థులు ప్రసంగించారు. దేశంలోని 60ప్రధాన యూనివర్సిటీల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనలపై ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు రూపొందించడం జరిగిందని వారు వివరించారు. సీఏఏ చట్టం కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చారని తెలిపారు. యూపీలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి మతానికి సంబంధించిన వారి వివరాలు తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.