లాక్డౌన్ కారణంగా రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అక్కడ వాళ్ల పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించారు. భోజనానికి సైతం ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన జగ్గారెడ్డి స్థానిక వ్యాపారి ద్వారా నిత్యావసర సరుకులు చేరవేయించారు. రాజస్థాన్, తెలంగాణ ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి 2, 3 రోజుల్లో స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
'ఇబ్బందులు పడుతున్నాం.. రాష్ట్రానికి రప్పించండి' - mla jaggareddy
లాక్డౌన్ కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తమను రాష్ట్రానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ఇబ్బందులు పడుతున్నాం.. రాష్ట్రానికి రప్పించండి'