తెలంగాణ

telangana

ETV Bharat / state

Student Union Leaders Protest: మినిస్టర్స్ క్వార్టర్స్​ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం - Rahul Gandhi Telangana Tour

Student Union Leaders Protest: హైదరాబాద్ బంజారాహిల్స్​లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకుని బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఓయూలో రాహుల్​గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వాలంటూ వారు నిరసన చేపట్టారు.

Protest
Protest

By

Published : May 1, 2022, 3:35 PM IST

Student Union Leaders Protest: ఈనెల 7న ఓయూలో రాహుల్​గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వాలని పలు విద్యార్థి సంఘాలు బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయం ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నాయకులు క్వార్టర్స్ వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు.

రాహుల్​గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని... ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాహుల్ పర్యటనపై విమర్శలు చేసిన బాల్కసుమన్ బేషరుతుగా క్షమాపణలు చెప్పలని డిమాండ్ చేశారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు మానవాత రాయ్, విజయ్, దయాకర్ పలువురు పాల్గొన్నారు.

Rahul Gandhi Telangana Tour: మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర ప‌ర్యట‌న‌ దృష్ట్యా టీపీసీసీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మే 6న రాష్ట్రానికి రానున్న రాహుల్​.. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్‌కు వెళ్లనున్నారు. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణతో ప్రత్యామ్నాయంపై నేతలు దృష్టిసారించారు.

మినిస్టర్స్ క్వార్టర్స్​ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

ABOUT THE AUTHOR

...view details