తెలంగాణ

telangana

ETV Bharat / state

చరవాణి వాడొద్దన్నందుకు... - విద్యార్థిని ఆత్మహత్య

చరవాణి వాడొద్దని తల్లి మందలించడం వల్ల హైదరాబాద్​ సనతనగర్​లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Mar 17, 2019, 1:29 PM IST

విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్​ సనత్​నగర్​లో విద్యార్థిని ఆత్యహత్య చేసుకుంది. చరవాణి వినియోగించవద్దని తల్లి మందలించడం వల్ల మనస్తాపానికి గురై ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక ఎస్​ఆర్​టీ నగర్​లో నివాసముంటున్న స్నేహ కుందన్​బాగ్​లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం విద్యార్థిని చరవాణిలో మాట్లాడడాన్ని గమనించిన తల్లి మందలించింది. మసస్తాపానికి గురై తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details