విద్యార్థికి కేటీఆర్ అభినందన - machine
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక.. వారికి ఉపయోగపడే యంత్రాన్ని కనుగొన్నాడు ఓ విద్యార్థి. ఇన్స్పైర్ నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి సాధించాడు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మన్నన పొందాడు.
సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటకు చెందిన అభిషేక్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది తరగతి చదువుతున్నాడు. బస్తాల్లో ధాన్యాన్ని ఎత్తే యంత్రాన్ని తయారు చేసి ప్రదర్శించాడు. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన అభిషేక్.. జాతీయస్థాయిలో మూడో స్థానం దక్కించుకున్నాడు. అభిషేక్‌ను కేటీఆర్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. లక్ష 16వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు.
తన తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తడానికి పడుతున్న కష్టాన్ని చూసి... యంత్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని అభిషేక్ తెలిపాడు. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది తన కలగా చెప్పాడు. సివిల్స్ రాసేందుకు అవసరమైన సహాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.