మా భవిష్యత్తో ఆడుకోకండి.... - అరోరా కళాశాల
ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఇంజినీరింగ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. రుసుం చెల్లించాలని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు రుసుం చెల్లిస్తే.. ఫీజు రీఎంబర్స్మెంట్ రాగానే తిరిగి చెల్లిస్తామన్నారు.
ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్నారు.