అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయని.. మన దేశంలో మాత్రం తగ్గకపోగా, రోజు రోజుకు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రంపై ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క రూపాయి పెరిగితే మన దేశంలో రూ.10 రూపాయలు పెంచుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహారిస్తోందని నారాయణ దుయ్యబట్టారు. విపత్కర పరిస్థితుల్లో యాక్ట్ ఆఫ్ గాడ్ కింద పన్నులు వసూలు చేయకూడదని నారాయణ అన్నారు.
పోలింగ్ బూత్కో టీవీ...
కేంద్రం సామాన్య ప్రజానీకాన్ని లూటీ చేస్తోందని నారాయణ మండిపడ్డారు. ధరల పెంపుపై రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. అప్పుడే రాష్ట్రాల అభిప్రాయాలకు కేంద్రం విలువిస్తుందన్నారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చమురు ధరల పెంపుపై చర్చిస్తామని స్పష్టం చేశారు. బీహార్‌లో అమిత్ షా మీటింగ్ కోసం పోలింగ్ బూత్‌కు ఒక్కటి చొప్పున టీవీలను కొన్నారని.. వీటి కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.