హైదరాబాద్ బషీర్బాగ్లోని తెలంగాణ స్టేట్ కోపరేటివ్ యూనియన్ కార్యాలయంలో 97వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మానవ సంబంధమైన వ్యవహారాలకు ప్రాతిపదికత సహకార సంఘాలేనని అన్నారు. వీటి ఆధునీకీకరణతో పాటు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకార స్ఫూర్తితోనే ముందుకెళ్తామన్నారు. సహకార స్ఫూర్తిని కలిగించేందుకు శిక్షణ ఇస్తున్న యూనియన్ కార్యాలయం.. విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న సహకార సభ్యులకు మంత్రి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.
'సహకార స్ఫూర్తితోనే రాష్ట్రం ముందుకు' - AGRICULTURE MINISTER NIRANJAN REDDY
భవిష్యత్ అవసరాలను తీర్చడంలో సహకార స్ఫూర్తి పై సీఎం కేసీఆర్కు తగిన అవగాహన, ప్రణాళికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులకు విశేష సేవలందిస్తున్న సంఘాలు, సహకార స్ఫూర్తితో ఏర్పడినవేనని తెలిపారు.
శిక్షణ ఇస్తున్న యూనియన్ కార్యాలయం..విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలి : నిరంజన్ రెడ్డి