'బాల బాలికల నిష్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ' - telangana place in Gender ratio
18:24 January 28
లింగ నిష్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానం: సత్యవతి రాఠోడ్
బాల బాలికల నిష్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. మాతా శిశు మరణాల తగ్గుదల రేటులోనూ తెలంగాణ తొలి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. మహిళలు, శిశువుల్లో పోషకాహార లోపం నివారించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉత్తర, దక్షిణ భారత్కు వారధిగా హైదరాబాద్: కేటీఆర్