తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ

జీహెచ్‌ఎంసీ సహా తెలంగాణలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌టైం స్కీంను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం సెప్టెంబరు 15తో ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలు రూ.1,477 కోట్లు ఉండగా.. ఇందులో వడ్డీనే రూ.1,017 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ
ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ

By

Published : Jul 29, 2020, 7:14 AM IST

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సహా రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌టైం స్కీంను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా, వడ్డీలో 10 శాతం మేర చెల్లిస్తే సరిపోతుంది. అప్పటివరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించేవారికే ఇది వర్తిస్తుంది.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం సెప్టెంబరు 15తో ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలు రూ.1,477 కోట్లు ఉండగా.. ఇందులో వడ్డీనే రూ.1,017 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details