తెలంగాణ

telangana

ETV Bharat / state

యూకే ఇండియా కౌన్సిల్​తో అవగాహన ఒప్పందం - UK

రాష్ట్రంలో ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. కానీ అందులో బ్రిటీష్​ ఆధారిత కంపెనీలు తక్కువగా ఉన్న దృష్ట్యా వాటి భాగస్వామ్యం పెంచుకునేందుకు యూకే ఇండియా కౌన్సిల్​తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని సంస్థలు వస్తాయి...

By

Published : Mar 26, 2019, 5:51 PM IST

Updated : Mar 26, 2019, 7:33 PM IST

మరిన్ని సంస్థలు వస్తాయి...
యూకే ఇండియా కౌన్సిల్​తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ హోటల్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్​రంజన్​, యూకే బిజినెస్​ సభ్యులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

మరిన్ని సంస్థలు వస్తాయి...

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నా... సంఖ్యాపరంగా బ్రిటీష్​ ఆధారిత కంపెనీలు తక్కువగా ఉన్నాయని ఐటీ కార్యదర్శి జయేష్​రంజన్​ తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ఆకర్షించటం సులువవుతుంది...

దక్షిణ భారతదేశంలో 18 సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని రంజన్​ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల ఆ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించటం సులువవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు: రహానే

Last Updated : Mar 26, 2019, 7:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details