గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హబ్సీగూడ, రామంతాపూర్, ఉప్పల్, చిలుకానగర్లలో ఆ పార్టీ అభ్యుర్థుల గెలుపుకోసం రోడ్‌షో నిర్వహించారు. రాష్ట్ర భాజపా ఉపాధ్యాక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టాడు.
గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్ - GHMC Elections 2020
గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.
గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్
అభ్యర్థులు చందన, బండారు శ్రీవాణి, శైలజా, శిల్పారెడ్డిలను గెలిపించాలని సంజయ్ ఓట్లను అభ్యర్థించారు. గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ
ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి తెరాస ఓటర్లను మభ్యపెడుతుందని ఆరోపించారు. రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.