రాష్ట్ర సర్వర్ల హ్యాకింగ్‌కు చైనా యత్నం : ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ
19:30 March 02
చైనా హ్యాకర్లపై కేంద్రం అప్రమత్తం చేసింది: ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ
రాష్ట్ర సర్వర్లపై చైనా హ్యాకర్లు హ్యాకింగ్ యత్నం చేశారని కేంద్రం తెలిపినట్లు ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రసార వ్యవస్థను ప్రభావితం చేసే యత్నం జరిగినట్లు కేంద్రం తెలిపిందని ఆయన అన్నారు. కొన్ని సబ్ స్టేషన్లలో థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లు తెలుస్తోందన్న సీఎండీ... కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైందని వివరించారు.
గ్రిడ్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌శాఖ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: జైలు జీవితం గడపక తప్పదు: బండి సంజయ్